ముత్తారం మండలంలో చెట్ల నరికివేతపై చర్యలు

 ముత్తారం మండలంలో చెట్ల నరికివేతపై చర్యలు

ముత్తారం, వెలుగు :  కరెంట్‌‌‌‌ లైన్ల కింద ఉన్న చెట్లను నరికివేయడంపై చర్యలు తీసుకుంటామని మంథని ఫారెస్ట్‌‌‌‌ రేంజ్​ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ముత్తారం మండలంలో రెండు రోజుల కింద విద్యుత్‌‌‌‌శాఖ సిబ్బంది నరికిన చెట్లను ఆయన పరిశీలించారు. నరికిన  చెట్ల కొలతలను సేకరించి ఎంత మేర నష్టం జరిగింతో పీఆర్ అధికారులతో కలిసి అంచనా వేశారు.

ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలు నరకాల్సి ఉండగా చెట్లను నరికేశారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సెక్షన్ అధికారి నర్స య్య, ఎంపీవో వేణు మాధవ్, ఫారెస్ట్ అధికారి పవన్ పాల్గొన్నారు.