మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై తేలనున్న అవిశ్వాసం

మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై తేలనున్న అవిశ్వాసం

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై పెట్టిన అవిశ్వాసం ఈరోజు(ఫిబ్రవరి 16) తేలనుంది. 2024 ఫిబ్రవరి 1 న అవిశ్వాసం ప్రకటిస్తూ..  సంతకాలు చేసి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అవిశ్వాస పత్రాన్ని కౌన్సిలర్లు ఇచ్చారు. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 మంది కౌన్సిలర్లు కాగా.. అందులో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 11 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు.

ఫిబ్రవరి 1 న కాంగ్రెస్ పార్టీలో చేరిన 7 గురు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల తో పాటు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలిసి అవిశ్వాసం పెట్టారు. మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ పై  మంథని మున్సిపల్ చైర్మన్ భవితవ్యం ఈరోజు తేలనుంది.