భారత అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు నలుగురు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లు ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకోనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం(జనవరి 2) తెలిపింది.
ఎంపికైన నలుగురు క్రీడాకారులు జనవరి 17న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకోనున్నారు.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 విజేతలు
- డి గుకేశ్ - చెస్
- హర్మన్‌ప్రీత్ సింగ్ - హాకీ
- ప్రవీణ్ కుమార్ - పారా అథ్లెటిక్స్
- మను భాకర్ - షూటింగ్
➡️ @YASMinistry announces #NationalSportsAwards 2024
— PIB India (@PIB_India) January 2, 2025
➡️ President of India to give away Awards on 17th January 2025
➡️ ‘Major Dhyan Chand Khel Ratna Award’ is given for the spectacular and most outstanding performance in the field of sports by a sportsperson over the period of… pic.twitter.com/nRY3nsleOY