Manu Bhaker: సీఎం తెలియదు.. కానీ విజయ్ నా డార్లింగ్: మను బాకర్

Manu Bhaker: సీఎం తెలియదు.. కానీ విజయ్ నా డార్లింగ్: మను బాకర్

భారత మహిళా షూటర్‌ మను బాకర్ ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత మను భాకర్‌ యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో  చెన్నై చేరుకున్న ఆమె చెన్నైలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో తమిళ నాడు సినీ అగ్ర హీరోల్లో ఒకరైన  తలపతి విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఈవెంట్‌లో ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఇంటరాక్షన్ లో మొదట ఆమెను చెన్నైలోని పాపులర్ టెంపుల్స్ కామాక్షి టెంపుల్, మహా బలేశ్వరం గురించి అడిగారు. దీనికి మను తెలియదని సమాధానం చెప్పింది. ఆ తర్వాత తమిళ నాడు సీఎం స్టాలిన్ గురించి తెలుసా అని అడిగిన ప్రశ్నకు తెలియదని చెప్పుకొచ్చింది. చివరిగా ఇక్కడ  ఫేమస్ యాక్టర్ విజయ్ తెలుసా అని అడగగానే.. ఆమె అవును నాకు తెలుసు.. ఆయన నా డార్లింగ్ అని సమాధామిచ్చింది. దళపతి విజయ్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె ప్రవర్తన మారిపోయింది.

మను బాకర్ చెప్పిన సమాధానానికి అక్కడ ఉన్న ప్రేక్షకుల నుండి బిగ్గరగా కేకలు వేయడంతో పాటు చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తమిళ నాడులో తలపతి విజయ్ కు ఎంత ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతని సినిమా వస్తుందంటే బాస్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురుస్తుంది. ఈ సీన్ చూసిన విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.