శుభారంభం..తొలి రోజు ఇండియాకు మంచి ఆరంభం..10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరిన మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

శుభారంభం..తొలి రోజు ఇండియాకు మంచి ఆరంభం..10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరిన మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశపర్చిన షూటర్లు
  • బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాకీ, టీటీలో బోణీ
  • రెపిఛేజ్‌‌‌‌కు రోయర్ పన్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు తొలి రోజు మంచి ఆరంభమే లభించింది. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన గురితో ఫైనల్లోకి దూసుకెళ్లి తొలి మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆశలు భారీగా పెంచేసింది. కానీ పతకం ఆశలు పెట్టుకున్న మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన షూటర్లు ఫెయిలవడం కాస్త నిరాశ కలిగించింది. ఇక బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీతో పాటు హాకీ వీరులూ మెరిశారు. టీటీ, రోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మనోళ్లు బోణీ చేయడం శుభసూచకం..!

చటౌరోక్స్ (ఫ్రాన్స్) : ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటర్ మను భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంచనాలను అందుకుంది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మను 580 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. వెరోనికా మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (హంగేరి, 582), వో యి జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కొరియా, 582) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లో నిలిచారు. ఇండియాకే చెందిన రిథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 573 పాయింట్లతో 15వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. మూడేళ్ల కిందట అందకుండా చేజారిన పతకాన్ని ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచే అద్భుతమైన గురితో ఆకట్టుకుంది.

తొలి రెండు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో వరుసగా 97 పాయింట్లు సాధించిన భాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 98 పాయింట్లతో నాలుగు నుంచి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూసుకొచ్చింది. అయితే ఐదో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 పాయింట్లే రాబట్టినా చివరి వరకు నిలకడగా ఆడటంతో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. ఇక రిథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే 26వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. అక్కడి నుంచి కోలుకున్నా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరలేదు. ఆదివారం టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–8 షూటర్ల మధ్య ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీమా నిరాశపర్చారు. క్వాలిఫయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 577 పాయింట్లతో 9వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలవగా, అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 574 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమయ్యాడు.

నాలుగో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100/100 పాయింట్లు నెగ్గిన సరబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3లో నిలిచినా చివరి వరకు దాన్ని కాపాడుకోలేకపోయాడు. 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రమిత జిందాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బబూట 628.7 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నారు. ఎలవెనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలారివన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 626.3 పాయింట్లతో 12వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలకడగా ఆడిన రమిత ద్వయం ఓ దశలో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరువగా వచ్చారు. కానీ చివరి మూడు షాట్లలో 1.0 పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో వెనక్కి వెళ్లిపోయారు. 

 పన్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏం చేస్తాడో?

రోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా నుంచి పోటీ పడుతున్న ఏకైక ఆటగాడు బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పన్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెపిఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో పన్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7:07.11 సెకన్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకింతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6:55.92 సెకన్లు), స్టెఫానోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌస్కోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7:01.79 సెకన్లు), ఎల్బానా (7:05.06 సెకన్లు) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3లో నిలిచారు. ప్రతి హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3 రోయర్లు క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. అయితే నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచిన రోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెపిఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీపడతాడు. ఇందులో నెగ్గితే డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడే అవకాశం లభిస్తుంది. 

కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

హాకీలో ఇండియా శుభారంభం చేసింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి తొలి లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 3–2తో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దీంతో మూడు పాయింట్లతో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. ఇండియా తరఫున మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24వ ని), వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (34వ ని), హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (59వ ని) గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లానె (8వ ని), సిమోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (53వ ని) కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు. ఆట ఆరంభం నుంచే ఇండియా వ్యూహాత్మకంగా ఆడింది. అయితే కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో అప్రమత్తమైన ఇండియా ఫార్వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టారు.

పదేపదే ప్రత్యర్థి సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లి గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశాలను సృష్టించారు. నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి స్కోరు సమం చేయడంతో కాస్త ఒత్తిడి నెలకొంది. అయితే మూడు నిమిషాల వ్యవధిలోనే  రెండుసార్లు కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకుపోయిన ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు మూడో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

సాత్విక్‌‌‌‌ జోడీ, సేన్ బోణీ

బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్ ఫేవరెట్స్‌‌‌‌ సాత్విక్ సాయిరాజ్‌‌‌‌-చిరాగ్ షెట్టి అదిరిపోయే విజయంతో బోణీ చేవారు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌-సి మ్యాచ్‌లో మూడో సీడ్స్ సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21-17, 21-14తో కార్వీ లుకాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-లాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రొనన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను వరుస గేమ్స్‌లో ఓడించారు.  మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి పోరులో యంగ్‌స్టర్‌‌ లక్ష్యసేన్‌ 21-8, 22-20తో కెవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్డన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (గ్వాటెమాల)పై నెగ్గాడు. సోమవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష్య.. జూలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరాగీ (బెల్జియం)తో తలపడతాడు. కాగా, టేబుల్‌ టెన్నిస్ ప్రిలిమినరీ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హర్మీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4-0తో యమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జోర్డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై నెగ్గాడు.