- నీరజ్‌తో పెండ్లి వార్తలను ఖండించిన భాకర్ తండ్రి
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు ముందు ఇండియా టాప్ అథ్లెట్లు నీరజ్ చోప్రా, మను భాకర్ ఒక్కచోట చేరి నవ్వుతూ మాట్లాడుకోవడం.. చోప్రాతో మాటకలిపిన భాకర్ తల్లి అతనితో తలపై ఒట్టేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో చోప్రా, భాకర్ పెండ్లి చేసుకోబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై మను భాకర్ తండ్రి రామ్ కిషన్ స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. మను చిన్న అమ్మాయి అని, తనకు ఇంకా పెండ్లి వయసు రాలేదని చెప్పాడు. ఇప్పటికి పెళ్లి ఆలోచనలే లేదన్నాడు. మను తల్లి.. నీరజ్‌ను కూడా తన బిడ్డగానే భావిస్తోందని తెలిపాడు.
ఇక, పారిస్ లో మూడో పతకం కూడా గెలిస్తే ఉంటే మరింత గొప్పగా ఉండేదని భాకర్ చెప్పింది. ఒలింపిక్స్‌లో మరిన్ని మెడల్స్ సాధించాలన్నదే తన టార్గెట్ అని మను తెలిపింది.