
పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన మను బాకర్ ఢిల్లీలో గ్రాండ్ గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మను భాకర్, ఆమె కోచ్ జస్పాల్ రాణాను భారీ పుష్పగుచ్ఛాలతో దండలు వేస్తూ వారిని ఆహ్వానించారు. మను బాకర్ ను చూడడానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. తాజాగా ఆమె శుక్రవారం (ఆగస్ట్ 9) న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కలిశారు.
మనుతో పాటు ఆమె కోచ్ జస్పాల్ రానా.. ఆమె కుటుంబం కూడా ఢిల్లీలోని రాహుల్ గాంధీని కలుసుకున్నారు. వీరందరికీ రాహుల్ గాంధీ ఆఫీస్ లో ఘనంగా స్వాగతం లభించింది. పుష్ప గుచ్చాలతో మను బాకర్ రాహుల్ గాంధీ స్వాగతం తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. రాహుల్ గాంధీని కలవడానికి ముందు, భాకర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడల్‌గా బ్రాంజ్ అందించింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించింది. ఇప్పటివరకు భారత్ సాధించిన మూడు మెడల్స్ లో మను బాకర్ నుంచి రెండు మెడల్స్ రావడం విశేషం. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో 4వ స్థానంలో నిలిచిన మను భాకర్ కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయింది.
Manu Bhaker is trolling BJP IT Cell everyday since she came back from Paris with double Medals 🥉🔥
— Amockxi FC (@Amockx2022) August 10, 2024
Day 1 : Manu met Madam Sonia Gandhi
Day 2 : Manu met Deepender Hooda
Day 3 : Manu met Rahul Gandhi
No wonder RW trolls are frustrated these days. Need more 😂 pic.twitter.com/LrZGYEb150