Paris Olympics 2024: హ్యాట్రిక్ మిస్.. తృటిలో మెడల్ చేజార్చుకున్న మను భాకర్

ఒలింపిక్స్ లో వరుసగా మూడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న మను భాకర్ కు నిరాశ ఎదురైంది. శనివారం (ఆగస్టు 3) జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో 4వ స్థానంలో నిలిచిన మను భాకర్ కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయింది. శుక్రవారం (ఆగస్టు 2) జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ విభాగం క్వాలిఫికేషన్‌లో మను ఫైనల్లో అడుగుపెట్టింది. 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొదటి ఎనిమిది మంది షూటర్లు ఫైనల్‌ చేరుకోగా టాప్ 3 లో మను స్థానం సంపాదించలేకపోయింది. 

అంతకుముందు మను భాకర్..10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు సాధించింది. తద్వారా, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా, మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆమె మూడోసారి ఫైనల్ చేరడంతో.. భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయమనుకున్నా నిరాశ తప్పలేదు.