Neeraj Chopra- Manu Bhaker: నీరజ్ చోప్రాతో డేటింగ్ రూమర్స్.. స్పందించిన మను భాకర్

ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఒక వీడియోలో మను భాకర్, నీరజ్ చోప్రా నవ్వుతూ మాట్లాడుకోవడం.. ఆ తర్వాత భాకర్ తల్లితో నీరజ్ చోప్రా మాట్లాడడంతో వీరిద్దరి మధ్య రూమర్లు ఎక్కువయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు  తెగ వైరల్ గా మారాయి. ఈ విషయంపై మను బాకర్ తండ్రి రామ్ కిషన్ వీరిద్దరిపై వస్తున్న పెళ్లి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా నీరజ్ చోప్రాతో వస్తున్న డేటింగ్ రూమర్స్ పై మను భాకర్ స్పందించింది.

తనకు నీరజ్ చోప్రా మధ్య వస్తున్న పెళ్లి వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. మను బాకర్ మాట్లాడుతూ.. " మా అమ్మతో మాట్లాడే సమయంలో నేను అక్కడ లేను. ఈ విషయం గురించి నాకు పెద్దగా తెలియదు. నేను 2018 నుండి కొన్ని ఈవెంట్‌లలో నీరజ్ చోప్రాను కలుస్తున్నాను. మా ఇద్దరి మధ్య ఎక్కువ సంభాషణ జరగదు. మేము కొన్ని ఈవెంట్‌లలో కలిసినప్పుడు  చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. బయట ప్రజలు మాట్లాడుకుంటున్న వార్తల్లో నిజం లేదు". అని నీరజ్ తో వస్తున్న రూమర్స్ కు మను బాకర్ చెక్ పెట్టింది. 

గురువారం (ఆగస్ట్ 8) అర్ధ రాత్రి   జరిగిన ఫైనల్లో నీరజ్‌ చోప్రా రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు.  దీంతో  భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి దేశానికి సిల్వర్ మెడల్ అందించాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి మెడల్‌‌‌‌గా బ్రాంజ్‌‌‌‌ అందించింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించింది.