Paris 2024 Olympics: మను భాకర్ డబుల్ ధమాకా.. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం

Paris 2024 Olympics: మను భాకర్ డబుల్ ధమాకా.. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించారు. భారత జోడీ 16-10తో దక్షిణ కొరియాను ఓడించడంతో కాంస్యం దక్కింది. మూడో సిరీస్ తర్వాత భారత్ 4-2 ఆధిక్యంలో ఉండగా.. ఆ తర్వాత ఆధిక్యాన్ని 8-2కి పొడిగించింది. ఎనిమిదో సిరీస్ తర్వాత సౌత్ కొరియా పుంజుకుని భారత్ ఆధిక్యాన్ని 6-10 కి తగ్గించినా.. చివరకు భారత్ 16-10 తేడాతో విజయం సాధించింది.

Also Read:-శ్రీలంకతో మూడో టీ20.. భారత జట్టులో భారీ మార్పులు  

సరబ్‌జోత్‌కు ఇదే తొలి ఒలింపిక్ పతకం. మరోవైపు మను భాకర్ ఒకే ఒలింపిక్ క్రీడలలో బహుళ పతకాలు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి మెడల్‌‌‌‌గా బ్రాంజ్‌‌‌‌ అందించింది. విమెన్స్‌‌‌‌ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌‌‌‌లో తన గురితో అదరగొట్టి పోడియంపైకి వచ్చిన మను..  12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లో పతకం గెలిచిన దేశ తొలి షూటర్‌‌‌‌‌‌‌‌గా చరిత్రకెక్కింది.