పారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు నీరజ్ చోప్రా,మను భాకర్ దేశానికి పతకాలు సాధించి హైలెట్ గా నిలిచారు. నీరజ్ ఏకైక సిల్వర్ మెడల్ తో దేశానికి అత్యుత్తమ మెడల్ అందించాడు. మరోవైపు మను భాకర్ షూటింగ్ లో రెండు కాంస్య పతకాలు సాధించి ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లిపై పుకార్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు.
Neeraj Chopra and Manu Bhaker are talking to each other as if they have a crush on each other. I am getting wild ideas on getting India a couple of future super athletes. pic.twitter.com/KXsTZDGq8y
— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) August 11, 2024
ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఒక వీడియోలో మను భాకర్, నీరజ్ చోప్రా నవ్వుతూ మాట్లాడుకోవడం.. ఆ తర్వాత భాకర్ తల్లితో నీరజ్ చోప్రా మాట్లాడడంతో వీరిద్దరి మధ్య రూమర్లు ఎక్కువయ్యాయి. అయితే నీరజ్, మను భాకర్ పెళ్లిపై తాజాగా ఆమె తండ్రి రామ్ కిషన్ క్లారిటీ ఇచ్చాడు. మను భాకర్ వయస్సు తక్కువగా ఉన్నందున ప్రస్తుతం ఆమె పెళ్లి గురించి ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. "మను భాకర్ కు చాలా చిన్న వయసు. ఆమె ఇంకా పెళ్లి వయసుకు రాలేదు. ఇప్పుడే ఈ విషయం గురించి ఆలోచించడం లేదు మను వాళ్ళ అమ్మ నీరజ్‌ని తన కొడుకులా చూసుకుంటుంది." అని ఆయన అన్నారు.
All you need is a medal in the Olympics to impress both mother and daughter.
— Yanika_Lit (@LogicLitLatte) August 12, 2024
Neeraj Chopra with Manu Bhaker and her mother. pic.twitter.com/5rDUOepyXs
గురువారం (ఆగస్ట్ 8) అర్ధ రాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు. దీంతో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి దేశానికి సిల్వర్ మెడల్ అందించాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడల్‌గా బ్రాంజ్ అందించింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించింది.
Manu Bhaker's father said, "Manu is still very young and not even of marriageable age. Manu's mother considers Neeraj Chopra like her son". (Dainik Bhaskar). pic.twitter.com/7S6VnRxNid
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2024