5 నెలల కనిష్టానికి ..మాన్యుఫాక్చరింగ్ ​రంగం

5 నెలల కనిష్టానికి ..మాన్యుఫాక్చరింగ్ ​రంగం

న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్ల వేగం నెమ్మదించడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో భారతదేశంలో తయారీ కార్యకలాపాలు ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఉత్పత్తి వృద్ధి తగ్గిందని నెలవారీ సర్వే మంగళవారం తెలిపింది.   కాలానుగుణంగా మారే ఎస్​అండ్​ పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సెప్టెంబర్‌‌లో 57.5కి పడిపోయింది. ఇది ఆగస్టులో 58.6గా రికార్డయింది. 

గత- ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది.  పీఎంఐ  50 కంటే ఎక్కువ అంటే విస్తరణ అని అర్థం కాగా, 50 కంటే తక్కువ ఉంటే నెగెటివ్​గా భావిస్తారు. భారత తయారీ పరిశ్రమ సెప్టెంబరులో మందగించిందని, కొత్త ఆర్డర్​లు కొద్దిగా తగ్గాయని ఎస్​ అండ్​పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా అన్నారు. 

అయినప్పటికీ, డిమాండ్,  అవుట్‌‌పుట్ రెండూ గణనీయమైన వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్​ఈస్ట్​ క్లయింట్ల నుండి కంపెనీలు బిజినెస్​లను పెంచుకున్నాయని తెలిపారు.