ఇండియాలో టెక్నో ఫోల్డబుల్ ఫోన్‌‌ల తయారీ

ఇండియాలో టెక్నో ఫోల్డబుల్ ఫోన్‌‌ల తయారీ
  •     ఈ నెల 11 న లాంచ్‌‌.. 

న్యూఢిల్లీ: శామ్‌‌సంగ్, ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లకు పోటీగా టెక్నో  తీసుకొస్తున్న ఫాంటమ్ వీ ఫోల్డ్  ఈ నెల 11 న ఇండియాలో లాంచ్ కానుంది.  అంతేకాకుండా ఈ ఫోన్‌‌ను నోయిడాలోని కంపెనీ ప్లాంట్‌‌లో తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 2.4 కోట్ల ఫోన్లు. టెక్నో ఫాంటమ్‌‌ను లిమిటెడ్ ఆఫర్ కింద రూ.77,777 కి అమ్మనున్నారు. సాధారణంగా ఈ ఫోన్ ధర రూ.89,999 (12జీబీ+256 జీబీ) నుంచి ప్రారంభమవుతోంది. అమెజాన్‌‌లో ఈ నెల 12 నే వీటి సేల్స్ మొదలుకానున్నాయి. 

టెక్నో ఫాంటమ్‌‌లో 7.65 ఇంచుల అమోలెడ్‌‌ ఫోల్డబుల్ స్క్రీన్‌‌ ఉంటుంది. మీడియాటెక్  డైమెన్సిటీ 9000+ ఎస్‌‌ఓసీ, 5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. 5జీ, డ్యూయల్‌‌ 4జీ  వోల్ట్‌‌, వైఫై 6, బ్లూటూత్‌‌ 5.3, యూఎస్‌‌బీ టైప్ సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్‌‌ ఈ ఫోన్‌‌లో ఉన్నాయి. ఫోల్డబుల్ ఫోన్లను మొదట శామ్‌‌సంగ్ తీసుకొచ్చింది. కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ల ధర రూ. లక్ష నుంచి మొదలవుతున్నాయి. ఒప్పో కూడా ఫైండ్ ఎన్‌‌ ఫోల్డ్ కింద ఫోల్డబుల్ ఫోన్‌‌ను లాంచ్ చేసింది. ఈ  ఫోన్ ధర రూ.లక్ష దగ్గర ఉంది. మిగిలిన ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే టెక్నో ఫాంటమ్‌‌ ధర కొద్దిగా తక్కువగా ఉంది.