గూడూరు, వెలుగు : కాంగ్రెస్‌తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మానుకోట కాంగ్రెస్ క్యాండిడేట్ మురళీనాయక్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు రైతులకు ఏకకాలంలో రూ. 3 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని విమర్శించారు. మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అనంతరం గూడూరు శివాలయ చైర్మన్ ఏపూరు రవీందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. వెంకన్న, కొమ్మాలు, శివ, వీరస్వామి, చంటి, సంపత్, శంకర్, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.