గూడూరు, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మానుకోట కాంగ్రెస్ క్యాండిడేట్ మురళీనాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గూడూరు వచ్చిన ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికి, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.
మానుకోటలో కాంగ్రెస్ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, చిట్టి వెంకన్న, మధు, వీరస్వామి, శివ, రాములు, శంకర్ పాల్గొన్నారు.