=కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్తన హయాంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయా స్కీమ్ల ద్వారా ఎంత మందికి లబ్ధి చేకూరిందనే దానిపై కామారెడ్డి నియోజక వర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్ల ద్వారా ఎంత మంది లబ్ధిదారులకు ఎంత అమౌంట్ఖర్చు చేశామనే వివరాల్ని ఇందులో పొందుపరుస్తున్నారు. వీటిల్లో పేర్కొనే వివరాల్లో కొన్ని చోట్ల తప్పుడు సమాచారం ఉండడంతో స్థానికులు విస్మయం చెందుతున్నారు.
ALSO READ :పేదల కడుపు నింపేందుకే ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ : దొడ్డా కృష్ణయ్య
దోమకొండ మండలం గొట్టిముక్లలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలో 11 మందికి గొర్రెల పంపిణీ చేశామని ఇందుకు రూ.10,31,250 ఖర్చు చేసినట్లు చూపారు. వాస్తవానికి ఈ ఊరిలో గొల్ల, కుర్మ వాళ్లు ఏవరూ లేరు. భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో రైతు బీమా ద్వారా 12 మంది లబ్ధిదారులకు మేలు జరిగిందని పేర్కొంటూ ప్లెక్సీలో పేర్కొనగా, వాస్తవానికి ఈ స్కీమ్ద్వారా ఇక్కడ ఒకరికే లబ్ధి చేకూరిందని స్థానికులు చెబుతున్నారు. రాజంపేట మండలం తలమడ్ల గొల్ల, కుర్మలు లేకున్నా,14 మందికి గొర్రెల యూనిట్ల పంపిణీ కింద రూ.13,12,500 ఖర్చు చేసినట్లు చూపారు.