కొండాపూర్లో బీజేపీ నుంచి బీఆర్ఎస్​లో చేరిక

సిరికొండ, వెలుగు :  కొండాపూర్​ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ లీడర్లు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పొడేండ్ల రమేశ్​సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆర్టీసీ చైర్మన్​బాజిరెడ్డి గోవర్ధన్​ వారికి కండువా కప్పి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్​చేపడుతున్న అభివృద్ధి పథకాలను ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ వైస్​చైర్మన్ ​అబ్బాస్, ఉప సర్పంచ్​సుమన్, వార్డు మెంబర్లు ఉన్నారు.