ఆదిలాబాద్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన పలువురు సీఐలు

చెన్నూర్, నస్పూర్, కోటపల్లి: బదిలీపై వచ్చిన పలువురు సీఐలు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. చెన్నూరు పట్టణ సీఐగా కె.రవీందర్, చెన్నూర్ రూరల్ సీఐగా డి.సుధాకర్, శ్రీరాంపూర్ సీఐగా బన్సీలాల్ బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది వారికి స్వాగతం పలికారు.