గ్రేటర్ హైదరాబాద్ లో వర్ష బీభత్సం

గ్రేటర్ హైదరాబాద్ లో వర్ష బీభత్సం
  • 2 గంటల వానకే సిటీ పరేషాన్

సిటీలో సోమవారం ఉదయం 2 గంటల పాటు కురిసిన భారీ వానకు పలు కాలనీలు నీట మునిగాయి. మెయిన్ రోడ్లపై నీళ్లు నిలవడంతో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్​ అయ్యింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మల్కాజిగిరి, ఈస్ట్​ ఆనంద్​బాగ్​ డివిజన్​ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, నాలాలను మల్కాజిగిరి డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్​తో కలిసి కార్పొరేటర్​ ప్రేమ్​కుమార్​ పరిశీలించారు. అవసరమైన చోట వెంటనే నాలాల రిపేర్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. జంట జలాశయాల నుంచి అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

ప్రస్తుతం ఉస్మాన్​సాగర్ ఇన్​ఫ్లో వెయ్యి క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,552 క్యూసెక్కులుగా ఉంది.  పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,786.65 అడుగుల నీరు ఉంది. అలాగే హిమాయత్ సాగర్​కు 600 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, అవుట్​​ ఫ్లో 660 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా.. 1,761.20 అడుగుల నీరు ఉంది. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు.


   – వెలుగు,హైదరాబాద్/మల్కాజిగిరి