నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. అన్ని వార్డుల్లో ఓటర్లకు డబ్బులిస్తూ.. తమ వీధిలో మాత్రమే ఇవ్వలేదని ఆరోపిస్తూ మిర్యాలగూడలోని 39 వార్డు సుందరయ్యనగర్ లోని పలువురు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేతలు తమకు ఓటుకు డబ్బులు ఇవ్వడం లేదని గొడవ పడ్డారు.
అన్ని వార్డుల్లో ఇచ్చి.. తమ వార్డుల్లో ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తాము వేరే పార్టీకి చెందిన వాళ్లమని స్థానిక నాయకులు నిందలు వేస్తూ తమకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు.