ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన  ప్రజావాణికి 72 దరఖాస్తులు వచ్చాయి. వీటిని కమిషనర్ ఆమ్రపాలి స్వీకరించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని అధికారులను అదేశించారు. ఇందులో టౌన్ ప్లానింగ్​కు సంబంధించి 48, హౌసింగ్ 6, రెవెన్యూ 5, ఎఫ్ఏ 4, హెల్త్ 3, ఎస్టేట్ 2, ఎల్​డబ్ల్యూఎస్, ఎలక్ట్రికల్, 

సీఈ మెయింటెనెన్స్, వెటర్నరీ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాలు ఉన్నాయి. ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా ఏడు, ఆరు జోన్లలో 92 అర్జీలు వచ్చాయి. కూకట్ పల్లి జోన్​లో 54, ఎల్బీనగర్​లో 14, సికింద్రాబాద్​లో 11, శేరిలింగంపల్లిలో 9, చార్మినార్​లో 3, ఖైరతాబాద్ లో ఒకటి చొప్పున వచ్చాయి. .

హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 147 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇందులో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 91, పింఛన్లు 23, భూ సమస్యలు 8, గ్యాస్ సబ్సిడీ 3, ఇతర ఫిర్యాదులు​22 ఉన్నట్లు పేర్కొన్నారు. 

వికారాబాద్:  రైతు రుణమాఫీ, భూ సమస్యల ఫిర్యాదులు అధికంగా వస్తున్న క్రమంలో మండల స్థాయిలోనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కలెక్టరేట్ హాల్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి179 ఫిర్యాదులను స్వీకరించారు.