కామారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. కామారెడ్డి టౌన్, దోమకొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
విప్మాట్లాడుతూ.. డబుల్ఇంజిన్ సర్కారు అంటూ చెబుతున్న బీజేపీ, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్హయాంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నామన్నారు. ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వాలంటూ.. ఆరు గ్యారెంటీలతో ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ఎంకె ముజీబోద్దీన్, లీడర్లు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, మదుసూధన్‌రావు, తిర్మల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.