మస్తు ఫీచర్లతో  మడత ఫోన్‌‌‌‌

మస్తు ఫీచర్లతో  మడత ఫోన్‌‌‌‌

ఆయన ఒకప్పుడు డ్రగ్‌‌‌‌ స్మగ్లర్‌‌‌‌. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం కొకైన్‌‌‌‌ తన చేతుల మీది నుంచే పోయేది. 1980ల్లో టాప్‌‌‌‌ బిలియనీర్‌‌‌‌ కూడా. సోదరుడిని పోలీసులు కాల్చేశారు. ఈయనా జైలుకెళ్లాడు. జైల్లో ఉన్నప్పుడే స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ కంపెనీ పెట్టాలనుకున్నాడు. పెట్టేశాడు. త్వరలో ఫోన్లు కూడా మార్కెట్‌‌‌‌లోకి రాబోతున్నాయి.  ఫోల్డబుల్‌‌‌‌ ఫోన్లు. పైగా తక్కువ ధరకు. ఫుల్‌‌‌‌ సెక్యూరిటీ ఫీచర్లతో.

జైల్లో ఉన్నప్పుడే..

రాబర్టో ఎస్కోబార్‌‌‌‌ (71).. 1970ల్లో ప్రపంచంలోని 80 శాతం కొకైన్‌‌‌‌ను సరఫరా చేసే పెద్ద డ్రగ్‌‌‌‌ స్మగ్లర్‌‌‌‌. ఫోర్బ్స్‌‌‌‌ లిస్టులో 1987 నుంచి 1993 వరకు టాప్‌‌‌‌ బిలియనీర్‌‌‌‌. 1992లో రాబర్టో సోదరుడు పాబ్లో ఎస్కోబార్‌‌‌‌ను కొలంబియా పోలీసులు కాల్చి చంపారు. రాబర్టో  లొంగిపోయాడు. ఆయనకు డ్రగ్స్‌‌‌‌కు సంబంధించిన నేరాల్లో 10 ఏళ్ల శిక్ష పడింది. జైలు నుంచి రిలీజయ్యాక దేశమంతా ఓ టూరేశాడు. జైల్లో ఉన్నప్పుడే స్మార్ట్‌‌‌‌ ఫోన్‌‌‌‌ మేకర్‌‌‌‌ కావాలనుకున్నాడు. వెరైటీ ఫోన్‌‌‌‌ను తయారు చేసి తక్కువ ధరకు అమ్మితే ఈజీగా అమ్ముడవుతాయని అనుకున్నాడు. దాన్నే అమలు చేశాడు. ఈమధ్యే ఫోన్‌‌‌‌ వివరాలను ఆయన కంపెనీరిలీజ్‌‌‌‌ చేసింది.

ప్రొప్రెయిటరీ ప్లాస్టిక్‌‌‌‌తో..

కొత్త ఫోల్డబుల్‌‌‌‌ ఫోన్‌‌‌‌కు తన సోదరుడు ఎస్కోబార్‌‌‌‌ పేరు పెట్టాడు. ‘ఎస్కోబార్‌‌‌‌ ఫోల్డ్‌‌‌‌ 1’గా మార్కెట్‌‌‌‌లోకి తీసుకొస్తున్నాడు. ఫోన్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ను ప్రొప్రెయిటరీ ప్లాస్టిక్‌‌‌‌తో చేశారు. ఆ ప్లాస్టిక్‌‌‌‌ వల్ల స్క్రీన్‌‌‌‌ పగలదట. ఇప్పటివరకు విడుదలైన ఫోన్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌లలో ఇదే మంచి కాలం మన్నిక గలదని ఎస్కోబార్‌‌‌‌ ఐఎన్‌‌‌‌సీ కంపెనీ సీఈవో వెల్లడించారు. ఆండ్రాయిడ్‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఆధారంగా ఫోన్‌‌‌‌ పని చేస్తుందని చెప్పారు. ఫోన్‌‌‌‌ను అన్ని రకాలుగా టెస్టు చేశామని, నాశనం చేయాలంటే కేవలం కాల్చాల్సిందేనని వివరించారు. ఫోన్‌‌‌‌లోని డేటాను బ్లూటూత్ స్కాన్ చేయడం చాలా కష్టమని, మనకు తెలియకుండా జరిగే కమ్యూనికేషన్లను ఆపడానికి సన్నటి లోహపు తెరను ఇందులో సెట్‌‌‌‌ చేశామని వివరించారు.

రెండు వేరియెంట్లలో..

రెండు వేరియెంట్లలో ఫోన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లోకి వస్తోంది. మొదటి రకం ఫోన్‌‌‌‌ 6 జీబీ ర్యామ్‌‌‌‌, 128 జీబీ స్టోరేజ్‌‌‌‌తో, రెండో రకం ఫోన్‌‌‌‌ 8 జీబీ ర్యామ్‌‌‌‌, 512 జీబీ స్టోరేజ్‌‌‌‌తో విడుదలవనున్నాయి. ఫస్ట్‌‌‌‌ ఫోన్‌‌‌‌కు రూ. 25 వేలు, రెండో ఫోన్‌‌‌‌కు రూ. 35 వేలు ధర నిర్ణయించారు. ఫోన్‌‌‌‌ను అమెరికాలో డిజైన్‌‌‌‌ చేశారు. హాంకాంగ్‌‌‌‌లో తయారు చేస్తున్నారు. తొలిసారి లక్ష ఫోన్లను విడుదల చేయనున్నారు. ఎస్కోబార్‌‌‌‌ డ్యుయల్‌‌‌‌ సిమ్‌‌‌‌ ఫోన్‌‌‌‌. ఇందులో  అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది.  క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌‌‌‌తో మొబైల్‌ వస్తోంది. ఫోన్‌‌‌‌ను ఏ దేశానికైనా ఉచితంగా షిప్పింగ్ చేస్తామని కంపెనీ తన అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పేర్కొంది.