బీజేపీలో పలువురు చేరిక  

 నల్గొండ అర్బన్, వెలుగు : నల్లగొండ పార్లమెంట్ కో –కన్వీనర్ పిల్లి రామరాజుయాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో వివిధ గ్రామాలకు చెందిన పలువరు కార్యకర్తలు శుక్రవారం బీజేపీలో చేరారు. పట్టణంలోని మర్రిగూడ, తిప్పర్తి మండలం ఇండ్లూర్ బీఆర్ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేశ్​నేతృత్వంలో సుమారు 200 మంది బీజేపీలో చేరారు.

పార్టీలో చేరినవారికి నాయకులు బీజేపీ  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.