టైటిల్: ఊకూకే ఫోన్ చుస్తే, కాస్టింగ్: చిన్ని, రవి, శ్రీ, లాంగ్వేజ్: తెలుగు, యూట్యూబ్ ఛానెల్: క్రియేటివ్ థింక్స్, రన్‌టైం: 22 నిమిషాలు, డైరెక్షన్:
శ్రీ చిన్ని అనే అమ్మాయి అదే పనిగా రోజంతా ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఉంటుంది. టైం తెలియకుండా ఫోన్‌తోనే గడుపుతుంటుంది. ఫోన్ చూడొద్దని ఎవరు చెప్పినా వినదు. తోటి పిల్లలు ఆడుకోవడానికి పిలిచినా పట్టించుకోదు. ఒక రోజు ఫోన్ చూస్తూనే ఊళ్లోకి వెళ్తుంది. కానీ.. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు కండ్లు సరిగా కనిపించవు. కానీ.. తనేమో ఊరంతా మబ్బుగ కనిపిస్తుంది అనుకుంటుంది. దాంతో తనని వాళ్ల ఇంటికి తీసుకెళ్లమని అదే ఊళ్లో ఉండే శ్రీకి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ వీడియో. ఇందులో పిల్లలు ఫోన్‌కు అడిక్ట్ కాకూడదనే మెసేజ్ ఇవ్వడంతోపాటు ప్రతి సీన్‌లో కామెడీ పండించారు. డైలాగ్స్ తెలంగాణ యాసలో బాగున్నాయి.
కండ్లు పోతయ్!
టైటిల్: ఊకూకే ఫోన్ చుస్తే
కాస్టింగ్: చిన్ని, రవి, శ్రీ,
లాంగ్వేజ్: తెలుగు, యూట్యూబ్ ఛానెల్: క్రియేటివ్ థింక్స్
రన్‌టైం: 22 నిమిషాలు, డైరెక్షన్: శ్రీ