వివేక్ వెంకట స్వామి బాటలో నడుస్తం : వంశీకృష్ణ 

వివేక్ వెంకట స్వామి బాటలో నడుస్తం : వంశీకృష్ణ 
  • బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరిక
  • కార్యక్రమాల్లో పాల్గొన్న వివేక్​సతీమణి సరోజ, కొడుకు వంశీకృష్ణ 

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి బాటలోనే తాము నడుస్తామని బీఆర్​ఎస్, బీజేపీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్​లో చేరారు.    చెన్నూరు పట్టణంలోని కుమ్మరి బాగుడ వాడ, బజ్జురు వాడ, పొన్నంవాడలో జరిగిన కార్యక్రమాల్లో వివేక్​వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొనగా.. ఆయనకు జనం ఘన స్వాగతం పలికారు. కుమ్మరి బాగుడలో జరిగిన కార్యక్రమంలో బజ్జూరి వినయ్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మూల రాజిరెడ్డి, రఘునందన్ రెడ్డి, చెన్న సూర్యనారాయణ, గొడిసెల బాపిరెడ్డి, చల్లా రాంరెడ్డి, మూల సత్యపాల్ రెడ్డి, పోగుల సత్యనారాయణ, తనుగుల రవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

వివేక్​ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధం:  గడ్డం సరోజ

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు కాకా వెంకటస్వామి ఆరు దశాబ్దాల పాటు సేవలందించారని, ఆయన అశయాలను కుమారులు వివేక్ వెంకట స్వామి, వినోద్ కు కొనసాగించే అదృష్టం దక్కిందని వివేక్ సతీమణి సరోజ అన్నారు. భర్త వివేక్ కు మద్దతుగా మందమర్రి మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. చెన్నూరులో వివేక్ వెంకటస్వామిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాకా కుటుంబం ప్రజల సేవ చేసేందుకే ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు. ప్రచారంలో దుర్గం నరేశ్, బండి సదానందం, నల్లాల క్రాంతి, గుడ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

జైపూర్​మండలంలో..

జైపూర్ మండలంలో జరిగిన కార్యక్రమంలో వివేక్​వెంకటస్వామి పాల్గొనగా.. వేలాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్​లో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన వేలాల ఎంపీటీసీ బూడే రాజేశ్వరి రాజబాబు, బీజేపీ పార్టీ నుంచి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉప సర్పంచ్ డేగ నగేశ్ తోపాటు.. శివ్వారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ చల్లా విశ్వంబర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి వివేక్ వెంకట స్వామి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.