గుడిహత్నూర్, వెలుగు : రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఆదివాసీ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి వన్నెల అశోక్ అన్నారు. బుధవారం గుడిహత్నూర్ మండలంలోని మాన్కాపూర్‌లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. పేదలు, ఆదివాసీల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, గతంలో తమ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.
అనంతరం గుడిహత్నూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా అశోక్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మండల సీనియర్ నాయకుడు అంకతి రవి, నియోజకవర్గ అబ్జర్వర్ తుల అరుణ్, జడ్పీటీసీ నర్సయ్య, ఎంపీపీ లక్ష్మీరాజేశ్వర్, కిసాన్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ మల్లేశ్, నేతలు మల్లెపూల సత్యనారాయణ, ముస్తాఫా, బాలాజీ పటేల్, చట్ల మహేందర్ తదితరులు ఉన్నారు
ALSO READ : ఎంపాకెట్‌లో 4 వేల మందికి జాబ్స్!