పోల్పై పనిచేస్తుండగా..కరెంట్ సప్లయ్..కార్మికుడి మృతి

జవహర్ నగర్, వెలుగు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఆకస్మత్తుగా సప్లై రావడంతో కరెంట్​పోల్​పై​ పనిచేస్తున్న కార్మికుడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజార్ తండాకు చెందిన బానోత్ ప్రశాంత్(26) ఉపాధి కోసం సిటీకి వచ్చాడు. 

నిండు గర్భిణి అయిన తన భార్య సరితతో కలిసి జవహర్ నగర్​లోని సంతోష్ నగర్​లో నివాసం ఉంటూ.. విద్యుత్ శాఖలో ప్రైవేటు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం సంతోష్ నగర్ లో కరెంట్​పోల్​పై వైర్లు మార్చుతుండగా, ఆకస్మత్తుగా సప్లై రావడంతో కిందపడి మృతి చెందాడు.

 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందాడని సరిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.