లారీ డ్రైవ‌‌‌‌ర్లలో స‌‌‌‌గం మందికి దృష్టి లోపాలు

‘సైట్ సేవ‌‌‌‌ర్స్’ స‌‌‌‌ర్వేలో తేలింది 
ఐఆర్‌‌‌‌బీ గోల్కొండ ఎక్స్‌‌‌‌ప్రెస్ వెల్లడి
ఈ నెల 21 నుంచి 23 వ‌‌‌‌ర‌‌‌‌కు ఆటోన‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌లో ఉచిత కంటి  వైద్య శిబిరం నిర్వహణ

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైవేలపై లారీలు నడిపే డ్రైవ‌‌‌‌ర్లలో దాదాపు స‌‌‌‌గం మంది కంటిచూపు స‌‌‌‌రిగాలేక ఇబ్బంది ప‌‌‌‌డుతున్నారని సైట్​ సేవర్స్​ అనే సంస్థ సర్వేలో వెల్లడైందని..  ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌‌‌‌ప్రెస్ వే పేర్కొన్నది. హైద‌‌‌‌రాబాద్ ఔట‌‌‌‌ర్ రింగ్‌‌‌‌రోడ్డు నిర్వహిస్తున్న ఐఆర్బీ సంస్థ.. వనస్థలిపురం ఆటోన‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌లోని హైద‌‌‌‌రాబాద్ గూడ్స్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ అసోసియేష‌‌‌‌న్ ట్రైనింగ్ అండ్ డెవ‌‌‌‌ల‌‌‌‌ప్‌‌‌‌మెంట్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆవ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌లో మూడు రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. గురువారం నుంచి శనివారం వరకు లారీడ్రైవ‌‌‌‌ర్లకు కంటి పరీక్షలు, అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన వారికి ఉచితంగా క‌‌‌‌ళ్లద్దాలు పంపిణీ చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టైటాన్ ఐ ప్లస్‌‌‌‌, హైద‌‌‌‌రాబాద్ గూడ్స్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ అసోసియేష‌‌‌‌న్ సహ‌‌‌‌కారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండు ద‌‌‌‌శ‌‌‌‌ల్లో క‌‌‌‌లిపి రెండు వేల మందికి పైగా లారీ డ్రైవ‌‌‌‌ర్లు ఈ శిబిరాల‌‌‌‌లో పాల్గొని, త‌‌‌‌మ కంటి చూపును ఉచితంగా ప‌‌‌‌రీక్షించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘‘లారీ డ్రైవర్లలో సగం మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని సైట్ సేవ‌‌‌‌ర్స్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దేశ‌‌‌‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 35 వేల మంది లారీ డ్రైవ‌‌‌‌ర్లను ప‌‌‌‌రీక్షించిన త‌‌‌‌ర్వాత ఆ సంస్థ ఈ విష‌‌‌‌యం వెల్లడించింది. 38 శాతం మందికి దగ్గరి చూపు సమస్య, 8 శాతం మందికి దూరదృష్టికి సంబంధించిన స‌‌‌‌మ‌‌‌‌స్యలు ఉన్నట్టు తెలిపింది. 4 శాతం మందికి రెండు ర‌‌‌‌కాల స‌‌‌‌మ‌‌‌‌స్యలున్నాయని ఆ సంస్థ తెలిపింది. 

దగ్గరి చూపు స‌‌‌‌మ‌‌‌‌స్య ఉన్నవారిలో ఎక్కువ మంది 36–50 ఏండ్లవారు.. దూర‌‌‌‌దృష్టి స‌‌‌‌మ‌‌‌‌స్య ఉన్న వారిలో 18–35 ఏండ్ల వారు ఎక్కువున్నట్టు సైట్​సేవర్స్​తన రిపోర్టులో వెల్లడించింది” అని తెలిపారు. ఐఆర్బీ సంస్థ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న  ట్రాఫిక్ డీసీపీ శ్రీ‌‌‌‌నివాసులు మాట్లాడుతూ కంటి చూపు స‌‌‌‌రిగా లేక‌‌‌‌పోతే అది మ‌‌‌‌న‌‌‌‌తో పాటు ప‌‌‌‌క్కవారి ప్రాణాల‌‌‌‌కు కూడా ప్రమాద‌‌‌‌క‌‌‌‌రం అవుతుంద‌‌‌‌న్నారు. 

డ్రైవ‌‌‌‌ర్లంద‌‌‌‌రూ త‌‌‌‌ప్పనిస‌‌‌‌రిగా ఈ అవకాశాన్ని స‌‌‌‌ద్వినియోగం చేసుకుని కంటి చూపు ప‌‌‌‌రీక్ష చేయించుకోవాల‌‌‌‌ని సూచించారు. ఈ రోజుల్లో 40 ఏళ్ల వ‌‌‌‌య‌‌‌‌సు నుంచే కంటి చూపులో కొంత సమస్య వస్తున్నదని.. స‌‌‌‌మ‌‌‌‌స్యను స‌‌‌‌కాలంలో గుర్తించి దానికి ప‌‌‌‌రిష్కారంగా కళ్లద్దాలు వాడాలని సూచించారు.