హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు పాక్షికంగా రద్దయ్యాయి. టెక్నికల్ సమస్యలు, ట్రాక్ ల మరమ్మతులతో 36 సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్ - లింగంపల్లి రూట్ లో 18 సర్వీసులు, ఫలక్ నుమా – లింగంపల్లి రూట్ లో 16 సర్వీసులు, సికింద్రాబాద్ – లింగంపల్లి రూట్ లో రెండు సర్వీసులు రద్దు చేసింది రైల్వే. వీటితోపాటు విశాఖపట్నం – నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంతో మంది నగరవాసులకు ప్ర‌యాణ అవ‌సరాల‌ను తీర్చే ఎంఎంటీఎస్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో  ఆర్టీసీ బ‌స్సుల్లో ర‌ద్ది పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి

మరిన్ని వార్తల కోసం

కేటీఆర్​తో చర్చకు సిద్ధం

నేటి యువతకు ఇవి చాలా అవసరం