- అండర్ గ్రౌండ్ గని విస్తరణకు ఓకే
- కార్మికవాడల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలె
- సీఎస్సార్, డీఎంఎఫ్టీ ఫండ్స్ఇక్కడే ఖర్చు చేయాలి
- ఎస్సార్పీ3, 3ఏ, ఆర్కే8 గనుల పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో కార్మికులు
కోల్‌బెల్ట్,వెలుగు : శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3, 3ఏ సింగరేణి అండర్ గ్రౌండ్ బొగ్గుగని విస్తరణకు ఎలాంటి అభ్యంతరం లేదని, పొల్యూషన్ బోర్డు ఆఫీసర్లు వెంటనే ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇవ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ ఏరియా కృష్ణా కాలనీలోని శాంతిమైదానంలో నిజామాబాద్రీజియన్ కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లక్ష్మన్ ప్రసాద్ఆధ్వర్యంలో ఎస్సార్పీ3, 3ఏ, ఆర్కే 8 గనుల పర్యావరణ పర్మిషన్ కోసం పబ్లిక్హియరింగ్నిర్వహించారు.
రెండు గనులు పర్యావరణ అనుమతికి మించి అధిక బొగ్గు ఉత్పత్తి చేసి ఉల్లంఘన కేటగిరి కింద ఉండటంతో ఎస్సార్పీ3, 3ఏ గని విస్తరణకు అవసరమైన ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కోసం ఉదయం, మధ్యాహ్నం వేర్వేరుగా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు. మంచిర్యాల అడిషనల్కలెక్టర్మధుసూదన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పబ్లిక్ హియరింగ్‌లో సింగరేణి కార్మికులు, ప్రజాప్రతినిధులు, కార్మిక, రాజకీయ పార్టీల లీడర్లు, ప్రభావిత ప్రాంతాల ప్రజలు, సింగరేణి ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అభిప్రాయాలను చెప్పారు.
2007–-08, 2008–-09 సంవత్సరాల్లో ఎస్పార్పీ3, 3ఏ గనిలో అనుమతికి మించి 9 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం పెద్ద సమస్య కాదని, జాతికి వెలుగులు పంచేందుకు కార్మికులు శ్రమించారన్నారు. గని విస్తరణ కోసం ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు తిరిగి పర్మిషన్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరారు.
నీళ్లు -కలుషితమవుతున్నయ్
సింగరేణి యాజమాన్యం గోదావరి నది నుంచి కార్మికవాడలకు కలుషితమైన తాగునీరు సప్లయ్చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి ప్రవాహం నిలిచిపోయిందని, సమీప ప్రాంతాల నుంచి వ్యర్థాలు, కలుషిత నీరు అందులో చేరుతోందని, ఆ నీటినే కార్మికవాడలకు సప్లయ్చేస్తున్నారని చెప్పారు. గోదావరి నదిని ఆనుకొని ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి కార్మికవాడలకు మిషన్ భగీరథ తరహాలో ప్రత్యేకమైన వాటర్ స్కీంను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
కార్మికవాడల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో 60 ఏళ్ల కిందట నిర్మించిన డ్రైనేజీలు కంపుకొడుతున్నాయని, రోడ్లు అధ్వానంగా మారాయని, కొత్తవి నిర్మించాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని, ఎస్పార్పీ3 గని నుంచి రాయల్ టాకీస్ వరకు రోడ్డు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. 10 వేల జనాభా కలిగిన ఆరుణక్కనగర్, భగత్‌సింగ్‌నగర్ తదితర కాలనీ ప్రజలు స్మశాన వాటిక లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని, గత పబ్లిక్ హియరింగ్‌లో చెప్పిన సమస్య తీరలేదని పేర్కొన్నారు.
శ్రీరాంపూర్ ఏరియాలో మరో 300 ఇండ్లకు పట్టాలివ్వాలన్నారు. ఓసీపీలు, సీహెచ్‌పీల్లో విపరీతమైన దుమ్ము వస్తోందని, డస్ట్ సప్రెషన్ వ్యవస్థ మెరుగుపర్చాలని కోరారు. సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందడం లేదని, స్పెషలిస్టు వైద్యులు, మందుల కొరత ఉందన్నారు. సింగరేణికి సంబంధించిన వేల కోట్ల సీఎస్సార్, డీఎంఎఫ్టీ ఫండ్స్ సింగరేణి ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్‌చేశారు. సింగరేణి ఫండ్స్‌తో హైదరాబాద్, మెట్పల్లి వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
ఎస్సార్పీ3, 3ఏ గని విస్తరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వెలిబుచ్చిన అభిప్రాయాలను కలెక్టర్ ద్వారా సీడీ రూపంలో కేంద్రానికి పంపిస్తామని -అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్చెప్పారు. పబ్లిక్హియరింగ్లో కార్మిక సంఘాల నేతలు బి.వెంకట్రావు, వాసిరెడ్డి సీతారామయ్య, యాదగిరి సత్తయ్య, రాజారెడ్డి, శంకర్రావు, జీవన్ జోయల్, బ్రహ్మానందం, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం గణపతి తదితరులు పాల్గొన్నారు.