యూట్యూబ్ ఛానెల్ పెట్టుడు..ప్రతి ఒకడు జర్నలిస్ట్ అనుడు: సీఎం రేవంత్ రెడ్డి

యూట్యూబ్ ఛానెల్ పెట్టుడు..ప్రతి ఒకడు జర్నలిస్ట్ అనుడు: సీఎం రేవంత్ రెడ్డి

అసలు జర్నలిస్టుల కంటే కొసరు జర్నలిస్టులు ఎక్కువయ్యారన్నారు సీఎం రేవంత్ రెడ్డి..  నిజమైన జర్నలిస్టులను అగౌరవపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు.  ప్రస్తుతం ఎవరు పడితే వారు యూట్యూబ్​ ఛానల్​ పెట్టుకుని జర్నలిస్టులంటున్నారన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి ..  అక్రిడేషన్లు, హెల్త్​ కార్డులు ఇస్తామన్నారు. జర్నలిస్టులు సమస్యలు సృష్టించవద్దన్నారు .

ఢిల్లీలో పనిచేసే తెలుగు జర్నలిస్టులకు కూడా వైద్యసదుపాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  కొంతమంది చిట్​ చాట్​లను కూడా బద్నా చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు సమాజానికి సేవ చేసే డాక్టర్లు అని రేవంత్​ అన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం అనేక చిక్కుముళ్లను పరిష్కరించిందన్నారు.  గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలకు జర్నలిస్టులకు అనుమతి లేదన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుకోవాలన్నారు.  ఈ వ్యవస్థలపై నమ్మకం పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. జర్నలిస్టులు పార్టీ కార్యకర్తలగా వ్యవహరించవద్దన్నారు.  కొన్ని రాజకీయ పార్టీలే పత్రికలు నడుపుతున్నాయన్నారు. సిద్దాంతాలను ప్రచారం చేసుకొనే పత్రికలు ఎక్కువయ్యాయన్నారు

ALSO READ | ఫ్యూచర్​ సిటీలో మిగతా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం

 గత పదేళ్లలో తెలంగాణలో ఏ వ్యవస్థకు పాలసీ లేదన్నారు. చిన్న, పెద్ద పత్రికలను ఎలా గుర్తించాలో ఒక నివేదకను తయారు చేయాలన్నారు.  ప్రెస్​ అకాడమీకి స్పెషల్​ ఫండ్​ కింద  రూ. 10 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఫ్యూచర్​ సిటీలో మిగతా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.   జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రెస్​ అకాడమీ చైర్మన్​ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కమిటీ వేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్​, ఐఎంపీఆర్​ కమిషనర్​ తదితరులు పాల్గొన్నారు.