సుమారు పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మూడో అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే కాదు, తెలంగాణ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పౌరహక్కు ల నాయకులు, సంఘాలు, అనేకమంది మేధావులు, పాత్రికేయులు ప్రధాన కారణం. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్ని కల హామీలలో.. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నది అత్యంత ప్రధాన హామీ. ఆ హామీని ప్రభుత్వంవేగవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
ముందుగా పైలట్ ప్రాజెక్టు తీసుకోవాలె
2014లో టీఆర్ఎస్ ఎన్నికల హామీలలో భాగంగా కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రతి మండల పరిధిలో అందిస్తామని చెప్పా రు. అయితే దానిని ఆచరణలో పెట్టడంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందింది. ఆ మాదిరిగానే మండల స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూ ళ్లను ఏర్పా టు చేస్తామంటున్న కాంగ్రెస్ వాగ్దానం కూడా కాకూడదు. అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం మంచిదే. కానీ, ఆచరణలో సాధ్యం చేయడానికి ఎటువంటి మార్గదర్శకాలు ఇప్పటికైతే అందుబాటులో లేవు. ఇప్పటి నుంచే ఆ స్కూల్స్ ఏర్పాటు కోసం పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టాలి. ఆయా మండలాలను యుద్ధ ప్రాతిపాదికన ఎంపిక చేసుకొని ఆ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టాలి. టీచర్స్, ఇతర సిబ్బందిని కూడా భర్తీ చేయవలసి ఉంటుంది.
దీనితోపాటు అనేక పాలనాపరమైన సమస్యలను కూడా అధిగమించవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో చెయ్యాలి అనుకుంటే అంత కష్టమేమీ కాదు. ఇది ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండిపోతుంది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కొత్తగా ఈ పాఠశాలల్లో కూడా కొంతమేరకు ఉద్యోగాలను భర్తీ చేస్తే మేలు. మండలానికి ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కచ్చితంగా దాన్ని అమలు చేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. విద్యా రంగం బాగుపడుతుంది.
ఇది కాంగ్రెస్ మంచి ఆలోచన!
అత్యంత ఆధునిక ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్కూ ల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చా రు. విద్యారంగంలో అట్టడుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ మాత్రమే కాకుండా ఇచ్చిన హామీ ప్రకారం మూతపడ్డ 6వేల స్కూళ్లు, రాష్టంలో ప్రైమరీ పాఠశాలలు లేని గ్రామాల్లోనూ వాటిని ఏర్పా టు చేయడం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పా టు చేయడం వంటి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావాలి. విద్యా రంగం అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఉందో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ, వారి ఎన్ని కల మేనిఫెస్టోని చదివితే పూర్తిగా కాకున్నా చెప్పుకోదగ్గ అవగాహన, ఆలోచన ఆ పార్టీకి ఉంది అని కచ్చి తంగా చెప్పవచ్చు , తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి ఉందని కూడా గ్రహించవచ్చు . అయితే ఇంటర్నేషనల్ స్కూల్ గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడాలంటే కాంగ్రెస్ దీన్ని ఎన్ని కల ప్రచార సమయంలో ప్రధాన అంశంగా అనేక చర్చల్లో ఆ పార్టీ ప్రెసిడెంట్, రాష్ట్ర నాయకులు, వారి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ప్రచారంలో పలుమార్లు ప్రస్తావించారు. దీన్ని బట్టి కాంగ్రెస్ చెప్పిన 6 గ్యా రంటీలతో పాటు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని గ్రహించవచ్చు.
- అశోక్ ధనావత్, సీనియర్ రీసెర్చర్, నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్