కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్అలీ పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట, మాచారెడ్డి మండలాలకు చెందిన పలువురు పార్టీలో చేరారు. షబ్బీర్అలీ మాట్లాడుతూ.. ప్రజల్లో మార్పు వచ్చిందని, కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూ.400కే సిలిండర్ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఏం చేసిందన్నారు. వేరే రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గిస్తున్నా, ఇక్కడ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని, బడుగు బలహీనవర్గాలకు అండగా ఉంటామన్నారు.