ఓటు అడగడానికి ఎట్ల వస్తరు..  ఇండ్ల ముందు ఫ్లెక్సీలు

 గోదావరిఖని, వెలుగు : తమకు మిషన్‌‌ భగీరథ పైపులైన్లు వేయలేదని, తాగునీరు రావట్లేదని, వర్షాకాలంలో వరదలతో ఇండ్లు మునిగితే, గోడలు కూలితే ఎవరూ రాలేదని గోదావరిఖని గాంధీనగర్‌‌ 41, 27వ డివిజన్లకు చెందిన పలు వురు వాపోతున్నారు. తమ బాధలు తెలియజేయడానికి ఎన్నికలను అనుకూలంగా మల్చుకున్నారు.

‘మా ఇంట్లోకి వరద వచ్చి, ఇంటి గోడ కూలినప్పడు రాని నాయకులు ఇప్పుడెలా వస్తారు’, ‘ మా ఇంట్లో మిషన్​భగీరథ నీరు రావట్లేదు’ ఓట్లు అడగడానికి ఎట్ల వస్తరు?’ అంటూ గాంధీనగర్‌లో కొందరు తమ ఇండ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అధికార పార్టీ లీడర్లు ఇటువైపు ప్రచారానికి రావడానికి జంకుతున్నారు.