దొరల అహంకారాన్ని కామారెడ్డి ప్రజలు సహించరు : వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: దొరల అహంకారాన్ని కామారెడ్డి ప్రజలు సహించరని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి మండలం క్యాంసంపల్లికి చెందిన పలువురు బుధవారం వెంకటరమణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువరాజు కేటీఆర్​వచ్చి గ్రామగ్రామాన చెప్పులు లేకుండా తిరిగినా, ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్​కు ఓటేయరన్నారు. ఓటమి భయంతోనే మండలానికో సభ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్​ఎస్​కు తగిన గుణపాఠం చెబుతారన్నారు.