
వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలకు, హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తికి చెందిన పలువురు బుధవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ చేపట్టిన పథకాలను చూసే చాలా మంది చేరుతున్నారన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఎలికట్టె రమేశ్, శ్రీనివాస్, రాజాబాబు, విజయ్, సమ్మయ్య, కరుణాకర్, సిద్ధు, సతీశ్, హరీశ్, మేరుగు రవీందర్, ఇల్లందుల వీరస్వామి, కొమురయ్య, కట్కూరు మధుకర్, తాళ్లపల్లి మనోహర్ జోషి, జీడీ స్వామి, కట్కూరి రాజేశ్ ఉన్నారు.