ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్‌‌ గెలవాలె : సీతక్క

తాడ్వాయి/ములుగు, వెలుగు : ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావాలని ఆ పార్టీ ములుగు క్యాండిడేట్‌‌ సీతక్క చెప్పారు. ములుగు జిల్లా తాడ్వాయిలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా బీరెల్లి ఆశన్నగూడ, ఎల్లాపూర్, కామారం, తాడ్వాయికి చెందిన పలువురు సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. అంతకుముందు తుడుందెబ్బ మాజీ అధ్యక్షుడు వీరేశం దశదినకర్మకు హాజరై నివాళి అర్పించారు. మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, నాయకులు అరేం లచ్చు పటేల్, సర్పంచ్‌‌లు ఇరుప సునీల్, రేగ కళ్యాణి, నాయకులు చిన్న ఎల్లయ్య, సప్పిడి రాము పాల్గొన్నారు. అంతకుముందు ములుగు మండలం కాశిందేవిపేటకు చెందిన లీడర్లు కాంగ్రెస్‌‌లో చేరడంతో కండువాలు కప్పి ఆహ్వానించారు.