కాంగ్రెస్​లో పలువురి చేరిక

ఖిలావరంగల్/ కాశీబుగ్గ/ వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఉమ్మడి వరంగల్​జిల్లా పరిధిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు శనివారం కాంగ్రెస్​పార్టీలో చేరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ బొల్లికుంట నుంచి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పసునూరి వేణుగోపాల్ (సాల్మన్) ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంటు ఇన్​చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వరంగల్​తూర్పు నియోజకవర్గానికి చెందిన బీఆర్​ఎస్​నాయకుడు రాజనాల శ్రీహరి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్​రావు సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ములుగు జిల్లా వెంకటాపూర్​మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన బీఆర్​ఎస్​ఎంపీటీసీ లక్ష్మి, ఇతర పార్టీల నాయకులు ములుగు జిల్లా కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్​సమక్షంలో కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు.