కాంగ్రెస్​నుంచి బీఆర్ఎస్​లోకి చేరికలు

కూసుమంచి,వెలుగు: సీఎం కేసీఆర్​ చేస్తున్న  అభివృద్ధిని చూసి  పలువురు బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు.  మండలంలోని  ముత్యాలగూడెం సర్పంచ్, కాంగ్రెస్ లీడర్​ ​ బొల్లికొండ శ్రీను, మరి కొంతమంది  హైదరాబాద్​లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్​ను వీడి బీఆర్​ఎస్​లో చేరారు. 

వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.పార్టీలో  కుక్క శ్రీను, బడేటి సురేశ్, కుక్క రాజేశ్, బొల్లికొండ రాములు, ఊడుగు పాపారావు తదతరులు చేరారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్​, సర్పంచ్​ కొండ సత్యం, ఎంపీటీసీలు జ్యోతి,  ఉమా, నల్లమోతు శ్రీను,   చాగంటి శ్రీను, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.