టూల్స్ గ్రడ్జెంట్స్ రన్నింగ్ బోర్డ్

టూల్స్ గ్రడ్జెంట్స్    రన్నింగ్ బోర్డ్

ఉద్యోగ బాధ్యతల్లో పడి చాలామంది ఫిట్​నెస్​ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ.. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నాలుగు అడుగులు వేయాలి. ఒకవేళ ఆఫీస్​లో కాస్త టైం దొరికినా నడవడానికి ప్లేస్​ ఉండదు. అలాంటివాళ్లుఈ అల్ట్రా స్లిమ్ ఫోల్డబుల్ రన్నింగ్ బోర్డ్ ఆఫీస్​కు తీసుకెళ్తే సరి. చాలా తక్కువ స్పేస్​ కావాలి దీనికి. వాకింగ్​ప్యాడ్​ అనే కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. హై స్ట్రెంత్​ అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారుచేశారు. వాకింగ్​ ప్యాడ్​ 57 అంగుళాల పొడవు ఉంటుంది. 

మందం కేవలం 2.25 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఎక్కడికంటే అక్కడికి దీన్ని మడతపెట్టి తీసుకెళ్లొచ్చు. బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని మీద వాకింగ్​ చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా హై సెన్సిటివ్ గ్రావిటీ సెన్సర్లు ఉంటాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్న వెంటనే యాక్సిలరేట్ తగ్గిస్తాయి. హై డెఫినిషన్ మానిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. అదే రిమోట్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా కూడా పనిచేస్తుంది. 

ధర: 29,000 రూపాయలు