- మంచిర్యాల బీజీపీ ప్రెసిడెంట్ రఘునాథ్ రావు
సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల పట్టణంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె19 రోజుకు చేరుకోగా.. శనివారం మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ రావు దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎస్ఎస్ఎ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేసి వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేశారు.
బీజేపీ సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఉపాధ్యక్షులు రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అన్నల్ దాస్ వేణు, గూడూరు భాస్కర్, దుమాల శ్రీకాంత్, ఆసాని రామలింగారెడ్డి బూర విష్ణు, గజ బీంకర్ చందు పాల్గొన్నారు.