
చర్మ సౌందర్యానికి సబ్బు వాడకూడదు. చాలా ప్రొడక్ట్స్ని ఆయుర్వేదం పేరుతో అమ్ముతున్నారు. ‘ఆయుర్వేద ప్రొడక్ట్ వాడితే ఎలాంటి ఇబ్బందులు రావు’ అని ప్రచారం చేస్తుంటారు. అది చూసి ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. పేస్ట్ దగ్గర నుంచి నూనెల వరకు అన్నీ ఆయుర్వేదం పేరుతో మార్కెట్లోకి వస్తున్నాయి. నిజానికి మొక్కల నుంచి వస్తే ఆయుర్వేదం అనాలి. అలాకాకుండా అవి ట్రాన్స్ఫామ్ అయి వస్తున్నాయి. అంతెందుకు కొన్ని ప్రాంతాల్లో జీరా వాటర్, వట్టి వేర్లతో తయారుచేసిన నీళ్లను ఆరోగ్యానికి మంచిదని ‘ఆయుర్వేదిక్ వాటర్’ పేరుతో అమ్ముతున్నారు. సాధారణంగా జీర్ణ సమస్య ఉంటే జీలకర్ర నీళ్లు తాగమని ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు.
కానీ, బయట అమ్మేవాటిలో అసలైన జీలకర్ర వేస్తారో లేదో తెలియదు. అదేకాదు ఫ్లేవర్ కోసం జీరా ఎక్స్ట్రాక్ట్ కలిపే అవకాశం కూడా ఉంది. అలాంటి వాటిని తాగితే మీరు ఏ ప్రయోజనం కోసం వాడుతున్నారో అది రాదు. మొదట్లో ప్రజలకు మంచి ప్రొడక్ట్ అందించాలనే ప్రారంభించొచ్చు. కానీ, బిజినెస్ పెరిగే కొద్దీ కమర్షియల్గా ఆలోచించడం మొదలుపెడతారు. దాంతో బ్రాండ్ పేరు ఉంటుంది. కానీ ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రం ఉండదు. కాబట్టి ఏ ప్రొడక్ట్ అయినా కొనాలంటే ముందు, వెనకా ఆలోచించాలి. వాటిని టెస్ట్ చేసి, చర్మానికి పడుతుంది అనుకుంటేనే వాడాలి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదం పేరుతో మోసపోవద్దు.
డా. చిలువేరు రవీందర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుష్ శాఖ, తెలంగాణ