- గద్వాలలో ఆందోళన పిల్లాపాపలతో పడిగాపులు
- తహసీల్దార్ అందుబాటులో లేకపోవడమే కారణం
గద్వాల, వెలుగు : రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు వెయిట్ చేసినా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో పలువురు గద్వాల తహసీల్దార్ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. తహసీల్దార్అందుబాటులో లేకపోవడమే కారణమని తెలిసింది. బాధితుల కథనం ప్రకారం...శుక్రవారం గద్వాల తహసీల్దార్ఆఫీసులో రిజిస్ట్రేషన్ కోసం దాదాపు 13 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందులో కేవలం మూడు రిజిస్ట్రేషన్లు మాత్రమే చేశారు.
కలెక్టరేట్లో మీటింగ్ ఉందని, మళ్లీ వస్తానని తహసీల్దార్వెళ్లిపోవడంతో మిగతా పదిమంది రిజిస్ట్రేషన్ల కోసం వెయిట్ చేశారు. సాయంత్రమైనా తహసీల్దార్ రాకపోవడంతో పిల్లాపాపలతో ఆఫీస్ దగ్గర పడిగాపులు కాశారు. గురువారం కూడా తహసీల్దార్..ఎమ్మెల్యే , కలెక్టర్ వెంట పిల్లిగుండ్లకు వెళ్లడంతో ఆరుగురి రిజిస్ట్రేషన్లు కాలేదు. దీంతో వీరు కూడా శుక్రవారం వచ్చి వేచి చూశారు. చివరకు రాత్రి ఏడు గంటలకు తహసీల్దార్ రావట్లేదని చెప్పడంతో 13 మంది ఆందోళనకు దిగారు.