ప్రధానిగా మోదీ: ప్రమాణస్వీకారానికి వస్తున్నదెవరు?

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి జూన్ 9న (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శుక్రవారం (ఈరోజు) మోదీ రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూని కోరారు. శుక్రవారం  మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా మూడో సారి. 

ఈ కార్యక్రమానికి రావాలని పలువురు దక్షిణాసియా నేతలకు ఆహ్వానాలు అందాయి. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జును కూడా పిలిచారట.. మయిజ్జు మోదీకి అభినందనలు కూడా తెలిపారు. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. గతకొంత కాలంగా మయిజ్జు చైనా దేశానికి అనుకూలంగా పని చేస్తూ.. భారత్ కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దూరమవుతున్నట్లు కనిపిస్తుంది. 

 శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల నేతలకు ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ ఆయనను ఆహ్వానించినట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కార్యాలయ మీడియా విభాగం తెలిపింది. విక్రమసింఘే ఆహ్వానాన్ని అంగీకరించారని, ఎన్నికల విజయంపై మోదీకి ఫోన్‌లో అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, నేపాల్‌ నేత పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ కూడా వేడుకకు హాజరు కావాల్సిందిగా కోరారు.