Health Alert : ఎడాపెడా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.. అతిగా మింగితే ఏం జరుగుతుందో తెలుసా..!

Health Alert : ఎడాపెడా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.. అతిగా మింగితే ఏం జరుగుతుందో తెలుసా..!

మెడికల్ షాపు అన్ని టాబ్లెట్ తప్పి వేసుకుంటాం. జ్వరం అదే పనిగా వస్తున్నా... తరచూ తలనొప్పి వస్తున్నా కూడా డాక్టర్ దగ్గర కు వెళ్లే బదులుగా ట్యాబ్లెట్ తో తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. కొందరైతే ముందుజాగ్రత్తగా జ్వరం వచ్చేలా ఉందంటూ ట్యాబ్లెట్ వేసుకోవ డం కూడా చూస్తుంటాం. అలసిపోయినప్పుడు జ్వరం రావడం, ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పి రావడం సహజమనీ...కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయని తెలిసినా కూడా కొందరు మాత్రలు వేసుకోకుండా ఉండలేరు. అయితే ఇలా పదే పదే మాత్రలు మింగడం మంచిది కాదంటు

న్నారు వైద్యనిపుణులు. కొంతమంది తలనొప్పి మాత్రలు మింగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  బెంగళూరుకు చెందిన  అనసూయమ్మ అనే మహిళ గత 15 ఏళ్లుగా తలనొప్పితో బాధప డుతోంది. దీంతో ఆమె నిత్యం మాత్రలు వేసుకో వడం అలవాటు చేసుకుంది. ఇటీవల ఆమెకు తలనొప్పి మరింత తీవ్రం కావడంతో రోజంతా అదే పనిగా ట్యాబ్లెట్స్ వేసుకుంది. దీంతో కా
సేపటికి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను విక్టోరియా హాస్పిటల్​ కు తీసుకెళ్లారు..అయితే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.

అతిగా మాత్రలు మింగడం వల్లే..

అతిగా మాత్రలు మింగడం చాలా ప్రమాదకర మని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు సమస్య తగ్గకపోగా మాత్రల కారణంగానే ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నా రు. నిజానికి తలనొప్పి, జ్వరం రావడానికి కార ణమేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. డాక్టర్ సూచన మేరకే ట్యాబ్లెట్స్ వాడాలని, మెడికల్ షాప్​ లో  ఏది ఇస్తే దానిని వేసుకోవడం ప్రాణాలమీదకు తెస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

–వెలుగు.. లైఫ్​–