టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన ఈటల... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు చెప్పారని, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తామన్న ఈటల.. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని చెప్పారు. అంతే కాదు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
చాలా మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ తో టచ్ లో ఉన్నరు..
- తెలంగాణం
- July 25, 2022
లేటెస్ట్
- సినర్ డబుల్.. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం
- అన్నిరంగాల్లో బాలకృష్ణ విశేష సేవలు
- జనవరి 27 నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన
- జాతీయ జెండా ఎగురవేసి.. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు యత్నం
- కరీంనగర్ జిల్లాలో సంక్షేమ పథకాలతో సర్కార్ భరోసా
- మహబూబ్ నగర్ జిల్లాలో లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు
- నల్దుర్తి అడవిలో పక్షి ప్రేమికుల ఆనందం
- సిద్ధయ్య గౌడ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం .. అందజేసిన బ్రోమిటోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
- వినూత్నరీతిలో దేశభక్తిని చాటుకున్న వరంగల్ యువకుడు
- ప్రమోషన్ ప్లీజ్.. ఏడాదిగా దాటవేస్తున్న అధికారులు
Most Read News
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి