- కలెక్టరేట్‌కు తరలివచ్చిన పలు గ్రామాల రైతులు
కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్మండలంలోని అడ్లూర్ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీళ్లను పంటల సాగుకే వినియోగించాలని డిమాండ్‌చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్‌కు పలు గ్రామాల రైతులు మంగళవారం తరలివచ్చారు. కామారెడ్డి టౌన్తాగునీటి అవసరాలకు పెద్ద చెరువు నుంచి 30 శాతం నీటిని వినియోగిస్తామనే ప్రపోజల్స్‌ను విరమించుకోవాలని కోరారు.
అడ్లూర్ఎల్లారెడ్డి, టెకిర్యాల్, అడ్లూర్, రంగంపేట, ఇస్రోజివాడి, పోశానిపేట పరిధిలోని ఆయకట్టుకు పెద్దచెరువు 2 పంటలకు సాగునీరందిస్తోందని చెప్పారు. చెరువు నీటిని తాగునీటి అవసరాలకు కేటాయిస్తే సాగుకు ఇబ్బందులు ఏర్పడుతాయని వాపోయారు. ఈ మేరకు అడిషనల్కలెక్టర్శ్రీనివాస్రెడ్డితోపాటు మున్సిపల్ కమిషనర్సుజాతకు, ఇరిగేషన్ ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేశారు.
రైతులను ఆగం చేయొద్దు
శ్రీనివాస్‌రెడ్డి, రైతు, అడ్లూర్ఎల్లారెడ్డిఅడ్లూర్ఎల్లారెడ్డి చెరువు ద్వారా చాలా గ్రామాలకు సాగు నీరందుతోంది. 2 పంటలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా ఈ చెరువు ద్వారా భూగర్భజలాలు ఉంటున్నాయి. టౌన్‌కు తాగునీళ్లను సప్లయ్ చేసేందుకు చెరువును తీసుకుంటామనే ఆలోచన విరమించుకోవాలి. మా భూములకు చెరువు నీళ్లే ఆధారం. రైతులను ఆగం చేయవద్దు