కాంటా వేశాక తరుగు తీసుడెందుకు..మిల్లర్లపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు

కాంటా వేశాక తరుగు తీసుడెందుకు..మిల్లర్లపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు

 

  •     జనగామ జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సభ్యుల ఆగ్రహం
  •     వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
  •     తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు
  •     జనగామ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివలింగయ్య

జనగామ, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతులను తరుగు పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని పలువురు జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వడ్లను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైంలో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోకపోవడంతో రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని మండిపడ్డారు. జనగామ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాగాల సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షతన శనివారం జనగామలో జడ్పీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివలింగయ్య, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్​ప్రపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడ్పీ సీఈవో వసంత హాజరయ్యారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాగానే పలువురు జడ్పీటీసీలు రైతుల సమస్యలను మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకొచ్చారు. రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ రఘునాథపల్లిలోని రూప రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లులో బస్తాకు అదనంగా మరో కిలో తరుగు తీస్తున్నారని చెప్పారు. సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంటా వేశాక మళ్లీ తరుగు తీయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చపల్లి, కోడూరు, రామన్నగూడెం తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని ఆఫీసర్లకు వివరించారు.

నీటి సమస్యను పరిష్కరించాలి

నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీలు గుడి వంశీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బొల్లం అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. రఘునాథపల్లి మండలంలోని కుసుంబాయి తండా, రామన్నగూడెం, ఖిలాషాపూర్, లింగాలఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని వనపర్తిలో నీళ్లు రావడం లేదన్నారు. దీంతో మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ ఈఈ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ప్రస్తుతం సమస్యలు లేవని, సరపడా నీళ్లు వస్తున్నాయన్నారు. పాలకుర్తి జడ్పీటీసీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ సెంటర్ల వద్ద ప్యాడీ క్లీనర్లు సరిగా లేవని చెప్పడంతో వాటిపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎం నాగేశ్వరశర్మను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. అలాగే లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమారస్వామి కార్మికుల ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో ఏజెంట్లను పెట్టుకొని డబ్బులు తీసుకుంటున్నాడని ఆరోపించారు. రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి మాట్లాడుతూ ఇండ్లు కట్టుకునే వారు మట్టిని తెచ్చుకునేందుకు గ్రామ పంచాయతీలే పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేలా చూడాలని కోరారు. 

తరుగు పేరుతో కోతలు పెడితే క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు

రైతుల సమస్యలను జడ్పీటీసీలు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివరించడంతో కలెక్టర్ శివలింగయ్య స్పందించారు.  తరుగు పేరుతో కోతలు పెట్టే రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లర్లపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు చేయడంతో పాటు, వారిని బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడుతామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే రైతులు ట్రాక్టర్లను కిరాయికి తీసుకొని వడ్లు మిల్లులకు తరలించాలని, ఆ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు ఖర్చులను ఇప్పించే బాధ్యతను ఆర్డీవోలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నట్లు చెప్పారు. జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాగాల సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ఆఫీసర్లు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పారు. 

ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గాల మధ్య లొల్లి

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అనుచరుల మధ్య జడ్పీ ఆవరణలో కొద్దిసేపు గొడవ జరిగింది. తాను ముత్తిరెడ్డి మనిషినని తన నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలా యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారని తరిగొప్పుల ఎంపీపీ భర్త జొన్నగోని సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోచంపల్లి వర్గానికి చెందిన జడ్పీటీసీలు గుడి వంశీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బొల్లం అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జడ్పీలో ఆయనకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. ఇష్టం లేకుంటే గ్రూపులో నుంచి లెఫ్ట్​అయితే సరిపోతుందని, గొడవకు దిగాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వారు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.