మన్యం ధీరుడు వస్తున్నాడు

మన్యం ధీరుడు వస్తున్నాడు

ఆర్ వి వి సత్యనారాయణ నటిస్తూ, నిర్మించిన  చిత్రం ‘మన్యం ధీరుడు’. నరేష్ డెక్కల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో సత్యనారాయణ కనిపించనున్నాడు.

 ఈ చిత్రం ద్వారా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌ను ప్రేక్షకులకు చూపించనున్నామని,  బానిస సంకెళ్ళు తెంచుకుని  బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయని దర్శకుడు నరేష్ చెప్పాడు. పవన్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.